దేశ, పార్టీ అభివృద్ధిలో యువతదే కీలకపాత్ర
బండి రమేష్
కూకట్ పల్లి, జూన్ 24 (విజయక్రాంతి): దేశాభివృద్ధిలో, పార్టీ అభివృద్ధిలో యువతదే కీలక పాత్ర అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు,రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ అన్నారు. బుధవారము కెపిహెచ్బి కాలనీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సలీం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ పార్టీకైనా యువత వెన్నుముకలా నిలుస్తుంది అన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గుర్తిస్తుందన్నారు. స్థానిక నాయకులు స్థానికంగా ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలన్నారు.
నాయకులు స్థానికంగా చేస్తున్న కార్యక్రమాలతోనే పార్టీ సముచిత స్థానం కల్పిస్తుంది అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే లక్ష్యంతో నాయకులు, కార్యకర్తలు, సైనికుల్లాగా శ్రమించాలని పిtలుపునిచ్చారు.నియోజకవర్గం లో రమేశ్, రాష్ట్రం లో రేవంత్ రెడ్డి, దేశం లో రాtహుల్ గాంధీ (ఆర్. ఆర్. ఆర్ ) నాయకత్వం బలపలాచాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర ఇంచార్జ్ భవ్య, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి రమ్య,యువజన విభాగం మేడ్చల్ జిల్లా ఇన్చార్జ్ రాంప్రసాద్. యువజన విభాగం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బొమ్మక అజయ్ తదితరులు పాల్గొన్నారు.






