రాజకీయ సహచరుడి పాడె మోసిన ఎమ్మెల్యే కృష్ణారావు
కూకట్ పల్లి, జూన్ 24 (విజయ క్రాంతి): మాజీ కౌన్సిలర్ సి హెచ్ సత్యనారాయణ ఆకస్మికంగా మరణించడంతో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆయన నివాసానికి వెళ్లి సత్యనారాయణ పార్థీవ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సత్యనారాయణ అంతిమ యాత్రలో ఎమ్మెల్యే కృష్ణారావు పాల్గొని పాడే మోసి అంతిమ వీడ్కోలు పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సత్యనారాయణ నాకు రాజకీయ సహచరుడే కాక చిరకాల మిత్రుడన్నారు.
సత్యనారాయణ రాజకీయ జీవితంలో మోతి నగర్, అవంతి నగర్ తోట అభివృద్ధికి విశేష కృషి చేశాడు అన్నారు. ఈ అంతిమయాత్రలో కూకట్పల్లి నియోజకవర్గ బి ఆర్ ఎస్ కోఆర్డినేటర్ సతీష్ ఆరోరా, మాజీ కార్పొరేటర్లు తూము శ్రావణ్, మందాడి శ్రీనివాసరావు, ఆవుల రవీందర్ రెడ్డి, మాధవరం రంగారావు, మొత్తం నరసింహ యాదవ్, పగుడాల బాబురావు, సబిహా గౌసుద్దీన్, మాజీ కౌన్సిలర్ మక్కల నర్సింగరావు, సీనియర్ నాయకులు వీరారెడ్డి, కృష్ణారెడ్డి, అంబటి శ్రీనివాస్, తిరుపతి, ఐలయ్య, సత్యం, పాతూరు గోపి, బొట్టు విష్ణు తదితరులు పాల్గొన్నారు.






