26 May, 2026 | 1:37 AM

ఉమెన్ తేమా టిక్ వీక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

26-05-2026 12:56 AM

శంకర్ పల్లి: మే 25( విజయ క్రాంతి): ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఉమెన్ తేమా టిక్ వీక్ శంకర్ పల్లి మున్సిపల్ మేనేజర్ అంజన్ కుమార్ తెలిపారు. డ్వాక్రా సంఘం మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 25వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఉమెన్ తేమ టిక్ వీక్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.

మహిళ సహాయక సంఘాల లో సభ్యులను చేర్చుట చేయాలని సూచించారు.కొత్త మహిళా సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. మహిళ సహాయక సంఘాల లావాదేవీలపై సమీక్ష నిర్వహించారు. మహిళా సంఘాల లోటుపాట్లపై కూడా చర్చించడం జరిగింది. ఉత్తమ మహిళ సహాయక సంఘాలను ప్రోత్సహించుట వంటి తదితర అంశాలపై చర్చించి తీర్మానం చేయడం జరిగింది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు వినోద్ కుమార్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.