కొహెడలో రణరంగం
- ఫ్రూట్ మార్కెట్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భూసేకరణపై రైతుల ఉగ్రరూపం
- ప్రాణాలకు తెగించి జేసీబీ ముందు పడుకున్న వృద్ధురాలు
- గజం భూమిని కూడా వదులుకోం: రైతుల హెచ్చరిక
- భారీగా పోలీసుల మోహరింపు
అబ్దుల్లాపూర్‌మెట్, మే 25: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొహెడ గ్రామం సోమవారం ఉదయం ఒక్కసారిగా రణరంగంగా మారింది. ప్రభుత్వ భూసేకరణ పనుల నేపథ్యంలో అధికారులు, పోలీసులకు స్థానిక రైతులకు మధ్య జరిగిన ఘర్షణతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత, భయాందోళనలు పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్జాతీయ పండ్ల మార్కెట్ విస్తరణతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి తమ జీవనాధారమై న పంట భూములను, ప్లాట్లను బలవంతంగా లాక్కుంటున్నారంటూ రైతులు ఉమ్మడిగా తిరుగుబాటు చేశారు.
నిర్మాణ పనులను ప్రారంభించి, భూములను ఆధీనంలోకి తీసుకోవడానికి ఆర్డీఓ, ఎమ్మార్వో మరియు గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ భారీ సిబ్బందితో కొహెడకు చేరుకున్నారు. అధికారులు రాకను గమనించిన వందలాది మంది రైతు లు, మహిళలు, భూ యజమానులు అక్కడికి చేరుకుని అధికారులను నలువైపులా ముట్టడించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, స్థానిక రైతులతో మాట్లాడకుండా మా భూముల్లోకి ఎలా అడుగుపెడతారు అంటూ అధికారులను నిలదీశారు.
బాధితుల ఆగ్రహం ముందు అధికారులు సమాధానం చెప్పలేక తీవ్ర ఇబ్బందులుపడ్డారు. భూములను చదు ను చేసేందుకు అధికారులు జేసీబీ వాహనాల ను ముందుకు కదిలించడంతో నిరసనలు ఉధృతమయ్యాయి. ఈ క్రమంలో ఒక వృద్ధురాలు ప్రాణాలకు తెగించి, ఏమాత్రం వెనక డుగు వేయకుండా కదులుతున్న జేసీబీ వాహనానికి అడ్డంగా నిలిచింది. అంతటితో ఆగకుం డా ఆమె నేరుగా జేసీబీ టైర్ల ముందే రోడ్డుపై పడుకుని సాహసోపేత నిరసన తెలిపారు.
మా పొట్టలు కొట్టి మీరు కట్టే భవనాలు మాకొద్దు, మమ్మల్ని చంపి మా భూములు తీసుకోండి అంటూ ఆమె చేసిన ఆర్తనాదాలు అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టించాయి. వృద్ధురాలి తెగింపుతో జేసీబీ డ్రైవర్ వాహనాన్ని అక్కడికక్కడే నిలిపివేయాల్సి వచ్చింది. రైతుల నిరస నలు హద్దులు దాటడం, అధికారుల చుట్టూ ముట్టడి తీవ్రం కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు కొహెడ గ్రామంలో భారీగా మోహరించారు. ఆందోళనకారులను బలవంతంగా అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు.
ఈ క్రమంలో రైతులకు, పోలీసులకు మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. మహిళా రైతులు పోలీసులను ఎదిరించి, భూములను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని భీష్మించుకు అక్కడే కూర్చున్నారు. దీంతో కొహెడ పరిసర ప్రాంతాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ భరిత వాతావ రణం ఏర్పడింది.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో కొహెడలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన భారీ ఫ్రూట్ మార్కెట్ కోసం దాదాపు 200 ఎకరాల భూమిని కేటాయించారు అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూములను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వంటి ఇతర ప్రభుత్వ భవనాలకు మళ్లిస్తోంద ని, అలాగే రైతుల ప్లాట్లను, సాగు భూములను అక్రమంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నాయి.
తమ అనుమతి లేకుం డా సాగు భూముల్లోకి ఏ ఒక్క అధికారి గానీ, జేసీబీలుగానీ రాకూడదని రైతులు స్పష్టం చేస్తున్నారు. భూసేకరణకు ముందే రైతులకు పూర్తి స్థాయిలో న్యాయపరమైన పరిహారం, ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని డిమాం డ్ చేస్తున్నారు. ఒకవేళ బలవంతపు భూసేకరణకు పాల్పడితే ప్రాణత్యాగాలకైనా సిద్ధమే కానీ ఒక్క గజం భూమిని కూడా వదులుకోబోమని రైతులు హెచ్చరించారు. ప్రస్తుతం కొహెడ గ్రామంలో పోలీసుల పహారా కొనసాగుతుండగా, రైతులు తమ భూముల్లోనే బైఠా యించి నిరసనను కొనసాగిస్తున్నారు.






