26 May, 2026 | 2:18 AM

పొంగులేటి పద్ధతి మార్చు కోవాలి

26-05-2026 01:24 AM

క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించే సమయం లో శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సహచర మంత్రి వాకిటి శ్రీహరి పట్ల ప్రవర్తించి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బలహీన వర్గానికి చెందిన తోటి మంత్రి పట్ల ఆయన వ్యవహరించిన తీరు అభ్యంతరకరమని, పొంగులేటి పద్ధతి మార్చుకోవాలని పలువురు బీసీ వర్గాల నేతలు హితవుపలుకుతున్నారు.

గతంలో మంత్రి కొండా సురేఖ పట్ల కూడా పొంగులేటి ఇలాగే ప్రవర్తించారని గుర్తుచేస్తున్నారు. తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించే సమయంలో శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సహచర మంత్రి వాకిటి శ్రీహ రి పట్ల ప్రవర్తించి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బలహీన వర్గానికి చెం దిన తోటి మంత్రి పట్ల ఆయన వ్యవహరించిన తీరు అభ్యంతరకరమని, పొంగులేటి ప ద్ధతి మార్చుకోవాలని పలువురు బీసీ వర్గాల నేతలు హితవుపలుకుతున్నారు. గతంలో మంత్రి కొండా సురేఖ పట్ల కూడా పొంగులేటి ఇలాగే ప్రవర్తించారని గుర్తుచేస్తున్నారు. తక్షణమే క్షమాపణలు చెప్పాలన్నారు.

పొంగులేటి తీరు అభ్యంతరకరం

మీడియా సమావేశంలో సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బలహీన వర్గాలకు చెందిన సహచర మంత్రి వాకిటి శ్రీహరి పట్ల వ్యవహరించిన తీరు అభ్యంతరకరం. గతంలో మంత్రి కొండా సురేఖ పట్ల కూడా పొంగులేటి వ్యవహరించిన తీరు బలహీనవర్గాలకు చేసిన అవమానంగా పరిగణించాలి.

మొదటిసారి ఎమ్మెల్యే, మంత్రి అయిన పొంగులేటి వ్యవహరిస్తున్న తీరు, అతని కుమారుడిపై వస్తున్న అవినీతి ఆరోపణలు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. పొంగులేటి తన అహంకారపూరితమైన ధోరణి మార్చుకోకపోతే బలహీనవర్గాలు కాంగ్రెస్‌కు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. మంత్రి శ్రీహరికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శ్రీనివాస్‌రెడ్డి హుందాగా వ్యవహరించాలి.

 డాక్టర్ తిరునహరి శేషు, బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్

ఆయన తీరు ఆక్షేపనీయం

బీసీ మంత్రి వాకిటి శ్రీహరిపై పేపర్ విసిరేయడం అవమానించడమే. మా సమాజిక వర్గానికి చెందిన మంత్రి పట్ల అగ్రకుల అహంకారాన్ని ప్రదర్శించడంపై మా అసోసియేషన్ పక్షాన ఆందోళన వ్యక్తంచేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

 హరి అశోక్‌కుమార్, టీబీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు 

క్షమాపణ చెప్పాలి  

బీసీ మంత్రి వాకిటి శ్రీహరిపై పేపర్లు విసిరివేసి అవమానించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీరుపై బీసీ సమాజం  ఆందోళన వ్యక్తంచేస్తున్నది. బేషరతుగా పొంగులేటి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.

 వీ ప్రకాశ్, టీబీసీ ఉద్యోగ జేఏసీ గౌరవ అధ్యక్షుడు, జగిత్యాల 

అణగారిన వర్గాలను అణచివేసే యత్నం

మంత్రి పొంగులేటి తీరు ఆదిపత్య కుల అహంకారానికి నిదర్శనం. ఇది ముమ్మాటికి అణగారిన వర్గాలను అణచివేసే ప్రయత్నమే. గతంలో కూడా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మీడియా మిత్రుల ప్రశ్నలకు సమాధానం చెబుతుంటే పొంగులేటి మైక్ కట్ చేశారు. దీంతో బీసీ మంత్రులపట్ల ఆయనకు ఉన్న అభిప్రాయం ఏంటో స్పష్టంగా అర్థమవుతున్నది. ఆధిపత్య కుల అహంకారాన్ని విడకపోతే రాజకీయ సన్యాసం తీసుకోనే వరకు వదలరు.              

 అనంతుల మధు, యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

అవమానించడమే..

మంత్రి వాకిటి శ్రీహరిపై మంత్రి పొంగులేటి పేపర్లు విసిరేసిన తీరు అవమానించేలా ఉన్నది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీరును సభ్య సమాజం అసహ్యించుకుంటున్నది. తక్షణమే పొంగులేటి క్షమాపణ చెప్పాలి.

 -బద్రి మల్లేశం, మున్నూరుకాపు సంఘం పాపన్నపేట మండల అధ్యక్షుడు

బీసీ మంత్రి అంటే అంత చులకనా!

సహచర మంత్రిపై పేపర్లు విసరడం ఏమిటి. బీసీ మంత్రిని అవమానించడమే. కాంగ్రెస్‌లో బీసీ మంత్రులకు మాట్లాడే స్వేచ్ఛ లేదు. జనాభాలో సగ భాగానికిపైగా ఉన్న బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కకపోవడమే కాదు.. కనీస గౌరవం కూడా లేదు. బీసీలకు సముచిత స్థానం కల్పించామని చెప్పుకునే ప్రభుత్వం, ఒక బీసీ మంత్రి పట్ల అగ్రకుల మంత్రి ప్రవర్తించిన తీరు పట్ల స్పందించకపోవడం దారుణం. ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి.

 మామిళ్ల ఆంజనేయులు, బీసీ సంఘం నేత, మెదక్ జిల్లా

మంత్రివర్గం నుంచి తొలగించాలి

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పొంగులేటిని మంత్రి పదవి నుంచి తొలగించాలి. వాకిటి శ్రీహరికి క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో అన్ని బీసీ సంఘాల నేతలం కలిసి అతని ఇంటిని ముట్టడిస్తాం.

 దొగ్గలి శ్రీధర్, బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి

పునరావృతం కావొద్దు

ఇది పొంగులేటి అహంకారానికి నిదర్శనం. వాకిటి శ్రీహరికి పొంగులేటి వెంటనే క్షమాపణ చెప్పాలి. ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి.

 తలారి బిక్షపతి ముదిరాజ్, మెదక్ జిల్లా 

ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి 

ముదిరాజ్ బిడ్డకు అవమానం

వాకిటి శ్రీహరి సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి. తోటి మంత్రి అనే మర్యాదలేకుండా దురుసుగా ప్రవర్తించిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీరును ముదిరాజ్ బిడ్డకు అవమానమే. ఇది యావత్ ముదిరాజ్ జాతికి జరిగిన అవమానంగా భావిస్తున్నాం. పొంగులేటి మీడియా సమక్షంలోనే క్షమాపణ చెప్పాలి.

 కృష్ణ ముదిరాజ్, పండుగ సాయన్న సామాజిక సేవ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు

ప్రజా ప్రభుత్వం అంటే ఇదేనా?

సహచర మంత్రిపై పోగులేటి ఏకంగా ఒక పత్రిక సమావేశంలో పేపర్ విసరడం అత్యంత దారుణం. వెంటనే పొంగులేటి క్షమాపణలు చెప్పకుంటే తీవ్ర పరిమాణాలు ఉంటాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు కనీస గౌరవం లేకుండా పోయింది. అందుకు ఉదాహరనే ఈ సంఘటన. ప్రజా ప్రభుత్వం అంటే ఇదేనా. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా బీసీ మంత్రులు స్పందించాలని కోరుతున్నాం.

 నర్సింగోజు శ్రీనివాస్, బీసీ యువజన సంఘం కరీంనగర్ జిల్లా ఆధ్యక్షుడు

భవిష్యత్ బీసీలదే

కాంగ్రెస్ ప్రభుత్వం అగ్రవర్ణాల ఆధిపత్యంలో నడుస్తున్నది. మంత్రి పొంగులేటి ప్రవర్తన సరికాదు. పొంగులేటి తీరు అగ్రవర్ణాల దురహంకారానికి సాక్షి. బీసీలు రాజకీయంగా ఎదుగుటుంటే ఓర్వలేక పోతున్నారు. సహచర మంత్రిని అవమానపర్చడం బీసీలను అవమానపర్చమే. భవిష్యత్ రాజ్యాధికారం బీసీలదే. 

- పగిళ్ల సతీశ్, బీసీ సంక్షేమ సంఘం నాయకుడు

బీసీలపై అగ్రవర్ణాల దురహంకారం

మంత్రి పొంగులేటి ప్రవర్తన అగ్రవర్ణాల దురహంకారానికి నిదర్శనం. బీసీలు రాజకీయంగా ఎదుగుటుంటే ఓర్వలేక పోతున్నారు. మీడియా సమావేశంలో సహచర మంత్రిపై రెడ్డి వర్గానికి చెందిన మంత్రి అవమానపర్చడం సరికాదు. భవిష్యత్ రాజ్యాధికారం బీసీలదే.

 చామకుర రాజు, సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షుడు

తోటి మంత్రులనే గౌరవించరా?

రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. బీసీ మంత్రులపై అగ్రవర్ణ అహంకారాన్ని ప్రదర్శిస్తూ శునకానందాన్ని పొందుతున్నారు. మంత్రులకే ఇలాంటి అవమానాలు జరుగుతుంటే తోటి బీసీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందించుకోవడం ఇది బీసీ సమాజానికే సిగ్గుచేటు.  కేవలం పదవులకోసమే ఆత్మగౌరవాన్ని చంపుకుని పదవుల్లో కొనసాగడం వాళ్ల విజ్ఞతకే వదిలేయాలి. బీసీలను తక్కువ చేసి చూస్తున్న నాయకులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రానున్న రోజుల్లో బీసీల, బహుజనుల రాజ్యాండీకారం వస్తుంది. 

 మహేశ్ వర్మ, టీఆర్పీ నేత