26 May, 2026 | 2:23 AM

ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి

26-05-2026 01:33 AM

హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి

హనుమకొండ, మే 25 (విజయక్రాంతి): ప్రజావాణి అర్జీలను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని  హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో  జిల్లా కలెక్టర్ వివిధ శాఖ అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం  ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు అందించిన అర్జీలను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అదనపు కలెక్టర్ ఎన్. రవి స్వీకరించారు.

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన వెంటనే సంబంధిత అధికారులను వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ అక్కడికక్కడే ఆదేశించారు.ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలను పరిష్కరించాలని విన్నవిస్తూ ప్రజలు 248 అర్జీలను కలెక్టర్,  అదనపు కలెక్టర్ కు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా డిఆర్‌ఓ శ్రీనివాస్, ఆర్డీవో రాథోడ్ రమేష్, జడ్పీ సీఈవో శేషాద్రి, డిఆర్డీవో మేన శ్రీను, సిపిఓ సత్యనారాయణరెడ్డి, జిల్లా అధికారులు, తహసిల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.