26 May, 2026 | 2:18 AM

మహిళా శక్తి సూపర్‌బజార్‌లు

26-05-2026 01:30 AM
  1. మహిళలూ పెద్ద వ్యాపారాల్లోకి రావాలి
  2. రైస్ మిల్లులు, గోదాములు, లాజిస్టిక్ పార్కులు నిర్మించుకోవాలి
  3. వంద ఎకరాలైనా ఇస్తాం
  4.    8 వేల ఇందిరా స్త్రీశక్తి భవనాల నిర్మిస్తాం
  5. సచివాలయం నుంచి వర్చువల్ శంకుస్థాపనలో సీఎం రేవంత్‌రెడ్డి
  6. పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్‌బాబు,  సీతక్క, పొంగులేటి, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి

హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): మహిళా సంఘాల ఆధ్వర్యంలో కార్పొరేట్ తరహాలో మహిళాశక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. డీమార్ట్, బిగ్‌బజార్లకు పోటీగా వీటిని నిర్మిస్తామన్నారు. మహిళా సంఘాలు ఇకపై చిన్నచిన్న ఉపాధి కార్యక్రమాలకే పరిమితం కాకుండా పెద్ద వ్యాపారాల్లోకి రావాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రైస్ మిల్లులు, మండల స్థాయిలో గోదాములు, లాజిస్టిక్ పార్కులు నిర్మించుకోవాలని సూచించారు.

వాటికి అవసరమైన చోట భూములను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అవసరమైతే 100 ఎకరాల వరకు భూములు ఇవ్వడానికి సిద్ధమని అన్నారు. ధాన్యం కొనుగోలు, నిల్వ, మిల్లింగ్ వ్యవస్థలో మహిళా సంఘాల పాత్ర పెరగాలని సీఎం అన్నారు. సంఘాలే వడ్లు కొనుగోలు చేసి, బియ్యం ప్రభుత్వానికి అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆడబిడ్డలు ప్రతి గింజకు జవాబుదారులుగా ఉంటారని, వారి చేతుల్లోకి ఈ వ్యవస్థ వెళ్తే పారదర్శకత, బాధ్యత మరింత పెరుగుతుందన్నారు.

రాష్ట్రంలో నిర్మిస్తున్న 8 వేల ఇందిరా గాంధీ స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి సోమవారం సచివాలయం వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదే వేదికపై చిలకపచ్చ రంగులో ఉన్న ఇందిరమ్మ చీరల నాలుగు కొత్త డిజైన్లను కూడా సీఎం ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్య సభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణు గోపాల్, మహిళా కమిషన్ చైర్మన్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఆయా విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..  మహిళా సంఘాల ఆధ్వర్యంలో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లు నెలకొల్పాలని సూచించారు.

డీమార్ట్, బిగ్‌బ జార్లకు పోటీగా ఉండేలా అద్భుతమైన మ హిళా శక్తి సూపర్ బజార్లు  ఏర్పాటు చేయాలని అన్నారు. పట్టణాల్లో సూపర్ బజార్ల ఏ ర్పాటుకు తక్కువ ధరకు స్థలాలను లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చె ప్పారు. నాణ్యమైన వస్తువులు ప్రజలకు అం దుబాటులోకి రావాలి, రైతుల ఉత్పత్తులకు మార్కెట్ దొరకాలి, మహిళా సంఘాలకు ఆదాయం రావాలి అన్నదే ఈ ఆలోచన వె నుక ఉన్న లక్ష్యమని వివరించారు.

వ గ్రామీణ ఉత్పత్తులకు మంచి మార్కెట్ లభి స్తే రైతులకు మేలు జరుగుతుందని, వినియోగదారునికీ నాణ్యమైన వస్తువు, మహిళా సంఘాలకూ ఆదాయం లభిస్తుందని చెప్పా రు. 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు బ్యాంక్ లిం కేజీ రుణా ల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 ల క్షలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు.  

8 వేల భవనాలకు శంకుస్థాపన

 ఒకే రోజు, ఒకే సమయంలో 8 వేల భవనాలకు శంకుస్థాపన చేయడం దేశంలోనే సంచలన నిర్ణయమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మహిళా సంఘాలకు సొంత భవనాలు ఉండటం అంటే కేవలం సమావేశాల స్థలం ఇవ్వటం కాదని, వారి ఆర్థిక కార్యకలాపాలకు, శిక్షణకు, వ్యాపార ప్రణాళికలకు శాశ్వత వేదికను నిర్మించడమని చెప్పారు.

తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజాప్రభుత్వం మహిళాశక్తిని దేశానికి ఆదర్శంగా నిలబెట్టాలన్న సంకల్పంతో ముందు కు సాగుతోందని అన్నారు. మహిళలను బస్సుల యజమానులుగా మార్చాలన్న ఆలోచనతో మహిళా సంఘాల ద్వారా 1000 బస్సులు కొనుగోలు చేయిం చి, వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే ప్రణాళికను అమలు చేసినట్లు చెప్పారు. ఇందులో భా గంగా జూన్ 5న పరేడ్‌గ్రౌండ్‌లో 553 బ స్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. 

ఆడబిడ్డలకు సారె.. ఇందిరమ్మ చీరలు

సోలార్ ఎనర్జీ అనగానే అదానీ, అంబానీ వంటి పెద్ద సంస్థలే గుర్తుకు వచ్చే పరిస్థితి మారిపోతుందని, రాష్ట్ర ప్రభుత్వం 1000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ ప్లాంట్లను మహి ళా సంఘాల ద్వారా ఏర్పాటు చేయించేందుకు చర్యలు తీసుకుంటోందని రేవంత్‌రెడ్డి అన్నారు. రిలయన్స్ వంటి సంస్థలు నిర్వహించే పెట్రోల్ బంకుల వ్యాపారంలోనూ సంఘాలను భాగస్వాములుగా చేస్తున్నామని సీఎం వెల్లడించారు. జిల్లా కేంద్రాల్లో, ముఖ్యమైన ప్రాంతాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చే స్తున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా వీడి యో కాన్ఫరెన్స్‌లో పలు జిల్లాల సమాఖ్యలతో ముఖ్యమంత్రి ముఖాముఖి మాట్లా డారు. నారాయణపేట మహిళా సమాఖ్య సభ్యులు పెట్రోల్ బంక్ ద్వారా తాము ఇప్పటివరకు దాదాపు రూ.27 లక్షలు సంపాదిం చామంటూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం వారిని ప్రత్యేకంగా అభినందిం చారు. మహిళా సంఘాలు చేపడుతున్న కొ న్ని వ్యాపారాల్లో నెలకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాయని అన్నారు.

ఇప్పటివరకు ఒక్క రూ పాయి కూడా బకాయి లేకుండా బ్యాంకులకు వందకు వంద శాతం రీపేమెంట్ చేసిన నిర్మల్ జిల్లా సమాఖ్య పరిధిలోని సంఘాలను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. మెయిన్ రోడ్డులో వారికి పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసే స్థలాన్ని కేటాయించాలని నిర్మ ల్ కలెక్టర్ ను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని మహిళా సంఘాలు ప్రతి రూపాయినీ నిజాయితీగా తిరిగి చెల్లిస్తూ ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు.

రాష్ట్ర ప్రభు త్వం ఆడబిడ్డలకు సారె లాగా ఇందిరమ్మ చీరలు అందజేస్తోందని సీఎం అన్నారు. పట్ట ణ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తామని, ఈసారి చిలుకపచ్చ రం గులో కొత్త డిజైన్ చీరలు ఇవ్వనున్నామని తెలిపారు. రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కొన్ని పార్టీలు మొదట్లో అవహేళన చేశాయని, కానీ ‘మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని మా నిబద్ధతతో నిరూపించామన్నారు.

కేవ లం రెండున్నర సంవత్సరాల కాలంలోనే ఏ కంగా రూ.60,000 కోట్లను బ్యాంక్ లింకేజీ ద్వారా మహిళలకు అందించి చారిత్రాత్మక రికార్డు సృష్టించాం. రాబోయే రెండున్నర ఏళ్లలో ఈ మొత్తం రూ.లక్ష కోట్లే కాదు.. రూ.1,25,000 కోట్లకు పైబడేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. మా ఈ విజయమే నాడు విమర్శించిన వారికి చెంపపెట్టు‘ అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. మహిళల ఆరి క సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి సీతక్క అన్నారు.

గ్రామీణ మహిళల జీవితాల్లో స్థిరమైన మార్పు తీసుకురావాలనే సంకల్పంతో సీఎం, మంత్రివర్గ సహచ రులు పనిచేస్తున్నారన్నారు. మంత్రులకు, సీఎంకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాప్రభుత్వంలో ఆడబిడ్డలకు కొత్త ఆర్థిక అవకాశాలు దక్కుతున్నాయన్నారు. సీఎంవో ముఖ్యకార్యదర్శి శేషాద్రి, పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దానకిశోర్, ఎండోమెంట్స్ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్, మహి ళా, శిశు అభివృద్ధి శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, సెర్ప్ సీఈఓ దివ్య, మహిళా శిశు అభివృద్ధి శాఖ డైరెక్టర్ శృతి ఓజా పాల్గొన్నారు.