మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడి తల్లికి ఎమ్మెల్యే పరామర్శ
నూతనకల్, మే 25: మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పసుల అశోక్ యాదవ్ తల్లి పసుల చంద్రకళను తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామేల్, రాష్ట్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ సోమవారం పరామర్శించారు. ఇటీవల చంద్రకళకు వెన్నెముక శస్త్రచికిత్స (స్పునల్ సరరీ) జరగడంతో, ఆమె ప్రస్తుతం ఎర్రపహాడ్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మందుల సామేల్, చెవిటి వెంకన్న యాదవ్తో కలిసి వారి గృహానికి వెళ్లారు. చంద్రకళ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పారు. వైద్యులు సూచించిన విధంగా విశ్రాంతి తీసుకోవాలని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో పీఏసీఎస్ (PACS) డైరెక్టర్ పసుల వెంకన్న యాదవ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు లింగాల రామచంద్రయ్య గౌడ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






