సమాజ హితమే లయన్స్ క్లబ్ అభిమతం
ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి
నారాయణఖేడ్, మార్చి 13:సమాజ శ్రేయస్సును కాంక్షించి ప్రజలకు ఉచిత సేవలు అందించాలనే సంకల్పంతో నారాయణ ఖేడ్ లైన్స్ క్లబ్ ను స్థాపించడం జరిగిందని లయన్స్ క్లబ్ వ్యవ స్థాపక అధ్యక్షులు ఎమ్మెల్యే పి. సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం లైన్స్ క్లబ్ అధ్యక్షులు సాయి సంగమేశ్వర సౌజన్యంతో కడపల్ గ్రామానికి చెందిన శేఖర్ ఆచార్య పూర్వ విద్యార్థి బేగరి శ్రీజ పెండ్లి సందర్భంగా పుస్తె మట్టలు అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారాయణఖేడ్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగులు, అనాధలకు నిత్యవసర వస్తువులు , కుట్టు మిషన్లు, ట్రై సైకిళ్లు , వీల్ చైర్స్, మున్సిపల్ కార్మికులకు వస్త్రాలు, అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజపు శ్రేయస్సు కోసం పాటుపడుతుందన్నారు . ఉచిత కంటి శిక్షల ద్వారా అనేకమందికి శస్త్ర చికిత్సలు అందించడం జరిగిందన్నారు.
రాబోవు రోజుల్లో మరిన్ని సే వా కార్యక్రమాలు నిర్వహించాలని సంకల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షులు సాయి సంగమేశ్వర్ జోన్ చైర్మన్ రాజ్ కుమార్ , డి సి చంద్ర శేఖర్ ఆచార్య, సభ్యులు వెంకట్రావు అంజిరెడ్డి రవికుమార్ మల్లేశం ముదసిర్, తదితరులు పాల్గొన్నారు.




