31 July, 2026 | 1:11 AM

ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి

31-07-2026 12:27 AM

మాజీ మంత్రి చంద్రశేఖర్ 

జహీరాబాద్, జూలై 30: ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని మాజీ మంత్రి, జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చంద్రశేఖర్ అన్నారు. గురువారం కోహిర్ మండల బిఎల్వోలు, ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ సర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ ఓటు కలిగిన ప్రతి వ్యక్తి ఓటర్ జాబితాలో నమోదు చేయాలని ఆయన సూచించారు.

బి ఎల్ వో లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమన్వయంతో ఓటర్ లిస్టును సక్రమమైన క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసేందుకు సహాయ సహకారాలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పట్లోళ్ల రామలింగారెడ్డి, జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ మొహమ్మద్ యూనుస్ జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఉగ్గేల్లి  రాములు, కోహీర్ r కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సువర్ణ మల్లన్న, పార్టీ నాయకులు పవన్ రాథోడ్, నరేష్ గౌడ్, హర్షద్ అలీ, శ్రీనివాస్ రెడ్డి ,అహమ్మద్, ఖండెం నరసింహులు, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.