సంగెం నగేష్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం, ఆగ్రోస్ చైర్మన్ కాసుల
30-07-2026 09:16 PM
బాన్సువాడ,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు (PA)సంగెం సురేందర్ రెడ్డి సోదరుడు కీ.శే. సంగెం నగేష్ రెడ్డి దశదిన కర్మ గురువారం బొర్లం గ్రామంలో స్వగృహంలో నిర్వహించిన కార్యక్రమనికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పోచారం శంభు రెడ్డి మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పోచారం సురేందర్ రెడ్డిలు వారి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మనో ధైర్యాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






