24 March, 2026 | 5:51 PM

ఆందోళనలు చేస్తే సెలవులు ఇవ్వాలా!

24-03-2026 12:00 AM

అంతుపట్టని బాసర త్రిఫుల్ ఐటీ వర్శిటీ వ్యవహారం 

విద్యార్థులకు నష్టమైనటున్న మేధావులు.. తల్లిదండ్రుల ఆందోళన  

అధికారులు, విద్యార్థుల మధ్య సమన్వయం లోపం

దిద్దుబాటు చర్యలపై ప్రభుత్వం దృష్టి 

త్వరలో వర్సిటీకి వస్తా: జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు

నిర్మల్, మార్చి 23 (విజయక్రాంతి): బాసర త్రిఫుల్ ఐటీ వ్యవహారం రోజుకు మలుపు తిరుగుతుంది. బాసర త్రిఫుల్ ఐటీలో హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థి సంఘాల ఆందోళన సాగుతూ విశ్వవిద్యాలయానికి వా రం రోజులు సెలవులు ప్రకటించడంపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికీ బాసర ట్రిపు ల్ ఐటీలో అధికారులు విద్యార్థుల మధ్య సమన్వయం లోపించి బాసర ట్రిపుల్ ల్ ఐటీ (ఆర్ జియుకెటి) ప్రతిష్టను దెబ్బతీస్తున్న తరుణంలో సెలవుల పేరుతో చదువులకు ఆటంకం కలిగించడంపై విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.

బాసర త్రిఫుల్ ఐటీలో ఇంటర్‌తో పాటు బీటెక్ ఇంటిగ్రేటెడ్ ఆరేళ్ల కోర్స్ కోసం దాదాపు 9,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే బాసరలో నిర్వహిస్తున్న ట్రిపు ల్ ఐటీలో మౌలిక సదుపాయాల కల్పన, నిధుల దుర్వినియోగం, వరుస ఆత్మహత్యలు, భోజన ఏజెన్సీల నిర్వహణలో లోపాలు, అధ్యాపకులు ప్రొఫెసర్ల కొడతా, ఇతర కారణాలపై విద్యార్థి సంఘాలు గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు, ఇటీవలి రంగారెడ్డి జిల్లా చెందిన విద్యార్థి మృతి చెందిన ఘటన నేపథ్యంలో దానికి అధికారులు బాధ్యత అం టూ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన కు తెర లేపారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల, వైస్ ఛాన్స్‌లర్ గోవర్ధన్ విద్యార్థులతో సంప్రదింపులు జరిపి ఆందోళనలు విరమించాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని విజ్ఞప్తి చేయగా వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని వారు ఇచ్చిన హామీతో ఆం దోళన తాత్కాలికంగా నిర్మించారు. అయితే హామీలు నెరవేరకపోవడంతో తిరిగి ఆందోళన చేపట్టి అవకాశం ఉన్నందున బాసర త్రిఫుల్ ఐటీ అధికారులు వారం రోజులు విశ్వవిద్యాలయానికి సెలవులు ప్రకటించడం ఇప్పుడు చర్చ జరుగుతుంది. 

ఆందోళనలు కొత్తేమీ కాదు..

ఏ విశ్వవిద్యాలయంలో వారి హక్కుల కోసం విద్యార్థులు ఆందోళన చేస్తే వారి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలి. కానీ బాసర త్రిఫుల్ ఐటీలో అనేక సమస్యలపై విద్యార్థులు ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. ఈ త్రిఫుల్ ఐటీలో ఇటువంటి పోరాటాలు ఆందోళనలు ఇవేమీ కొత్త కావు. రెండు సంవత్సరాల క్రితం 20 రోజులు విద్యార్థులు ప్రత్యక్ష ఆందోళన చేపట్టిన విషయం తెలిసింది. అప్పట్లో అధికారులు ఇచ్చిన హామీలు ఇప్పటికీ కొన్ని నెరవేర్చలేదు.

బాసర త్రిఫుల్ ఐటీ సమస్యలపై ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అసెంబ్లీ సాక్షిగా గళం వినిపించారు. బాసర త్రిఫుల్ ఐటీ లో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని, విశ్వవిద్యాలయాన్ని నిర్వహణ చేసే వైస్ ఛాన్స్‌లర్ ఒంటెద్దు పోకడలు చేస్తున్నారని, త్రిఫుల్ ఐటీ ప్రాంగణంలో ఉన్న ఏజెన్సీలు వ్యాపార దుకాణాలు విద్యార్థుల నుంచి దోపిడీ చేస్తున్నాయని అసెంబ్లీ సాక్షిగా ఆరోపించారు. బాసర త్రిఫుల్ ఐటీ సమస్యలు పరిష్కరించి విద్యార్థులు చదువుకు మంచి వాతావరణం కల్పించాలని ముఖ్యమంత్రి కి విన్నవించారు. అయితే ప్రభుత్వం ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలపై ప్రభు త్వం దృష్టి పెట్టి విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడి వారి డిమాండ్లను కొన్ని పరి ష్కరించి అవకాశం ఉంది.

కానీ ప్రస్తుతం మళ్లీ ఆందోళనలు జరుగుతాయేమోనన్న ఊహతో బాసర త్రిఫుల్ ఐటీకి సెలవులు ప్రకటించడమే విచిత్రంగా ఉందని విద్యా విద్యావిత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆందోళనలు చేస్తే సెల వులు ఇవ్వాలా. వాటి పరిష్కారానికి ప్రభుత్వానికి అవకాశాలు లేవా. ఇలా ఆందోళన చేసినప్పుడల్లా సెలవులు ఇస్తే వారి విద్య చదువులు ఏమైపోవాలి, అంటూ నిరుపేద విద్యా ర్థుల తల్లిదండ్రులు తమ ఆవేదనను బహిరంగంగానే వెళ్ళగక్కుతున్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి మంచి ఉన్నత స్థితికి చేర్పించవలసిన అధికారులే ఇలా సెలవులతో విద్యకు దూరం చేయడం విద్యార్థి విద్యపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 

దిద్దుబాటు చర్యలపై ప్రభుత్వం దృష్టి 

బాసర ట్రిపుల్  ఐటీలో ఆందోళన పేరుతో సెలవులు ప్రకటించడం పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో సోమవారం ప్రభుత్వం దిద్దుబా టు చర్యలు చేపట్టింది. జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు బాసర త్రిఫుల్ ఐటీ వైస్ ఛాన్స్లర్ గోవర్ధన్, హూ ఇస్ ది మురళీ దర్శన్ తో ప్రత్యేక భేటీ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత పది రోజులుగా బాసర త్రిఫుల్ ఐటీలో జరుగుతున్న పరిణామాలు, చేపట్టిన చర్యలు, ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా చర్చించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని జిల్లా ఇన్చార్జి మం త్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.

అయితే ఆందోళన సాకుగా చూపి సెలవులు ఇవ్వడం పై కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. త్వరలో బాసర త్రిఫుల్ ఐటీకి వచ్చి విద్యార్థులతో చర్చలు జరిపి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి హామీ ఇవ్వడంతో సెలవులు తర్వాత అక్కడ పరిస్థితులు మారుతాయి లేదో వేచి చూడాల్సింది.