రేపటి నుంచి హై లైఫ్ ఎగ్జిబిషన్ సమ్మర్ ఎడిషన్ షురూ..
మూడు రోజుల పాటు నోవాటెల్ హెచ్‌ఐసీసీలో నిర్వహణ
హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరం మరొక్కసారి హై లైఫ్ ఎగ్జిబిషన్ వారి సమ్మర్ ఎడిషన్‌తో విలాసవంతమైన, స్టైలిష్ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతోంది. భారతదేశపు అత్యుత్తమ డిజైనర్ల అద్భుతమైన బ్రైడల్ కలెక్షన్స్, పండుగ వస్త్రాలు, ఆధునిక ఫ్యాషన్, చేతితో తయారు చేసిన ఆభరణాల ప్రదర్శనను ఒకే చోట వీక్షించండి. సంప్రదాయం, ఆధునికత మేళవించిన అద్భుతమైన సమ్మర్ ఎడిషన్ కలెక్షన్స్ ఈ ఎగ్జిబిషన్‌లో అందుబాటులో ఉన్నాయి.
మీరు పెళ్లి కోసమో, పండుగ కోసమో లేదా మీ వార్డ్‌రోబ్‌ను సరికొత్తగా మార్చుకోవడానికో షాపింగ్ చేయాలనుకుంటే, హై లైఫ్ మీకు ఒక అద్భుతమైన వేదికను అందిస్తుంది. ఈ నెల 10, 11, 12 తేదీల్లో హైదరాబాద్‌లోని నోవాటెల్ హెచ్‌ఐసీసీలో జరిగే ఈ ప్రీమియం ఫ్యాషన్ వేడుకలో భాగమవ్వాలని, ఫ్యాషన్ ప్రియు లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.




