9 July, 2026 | 2:15 AM

ఆగస్టు 5వ తేదీలోగా మిల్లరు బకాయిలు చెల్లించాలి

09-07-2026 01:33 AM

మహబూబాబాద్, జూలై 8 (విజయక్రాంతి): యాక్షన్ ప్యాడీ, సీఎంఆర్ బకాయి ఉన్న రైస్ మిల్లర్లు ఆగస్టు 5వ తేదీలోగా తమ బకాయిలను ప్రభుత్వ ఖజానాకు జమచేయాలని సివిల్ సప్లయి టాస్క్ ఫోర్సు అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు ఆదేశించారు. బుధవారం మహబూబాబాద్ కల్లెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ కే.అనిల్ కుమార్ నేతృత్వంలో యాక్షన్ ప్యాడీ (రబీ 2022,23), సీఎంఆర్ బకాయిలు, డిఫాల్ట్ రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించని డిఫాల్ట్ రైస్ మిలర్లపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.

ఈకార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాలు అధికారి జే. రమేష్, జిల్లా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మేనేజర్ వీ.నరసింహరావు, సివిల్ సప్లయి టాస్క్ ఫోర్సు అధికారులు లక్ష్మా రెడ్డి, సివిల్ సప్లయి టాస్క్ ఫోర్సు సీఐ వసంత్ కుమార్ , ఇతర టాస్క్ ఫోర్సు సిబ్బంది మహబూబాబాద్ జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఓలం కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి నాళ్ళ వెంకటేశ్వర్లు, కోశాధికారి చిల్లంచెర్ల సతీష్ కుమార్, కార్యవర్గం, రైస్ మిల్లర్స్ పాల్గొన్నారు.