2 June, 2026 | 3:47 AM

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

02-06-2026 12:00 AM

టీఎంయూ డిపో అధ్యక్షుడు దామోదర్ రెడ్డి 

ఎల్బీనగర్, జూన్ 1: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని టీఎంయూ డిపో అధ్యక్షుడు దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ అశ్వథామ రెడ్డి వర్గం రాష్ట్ర కమిటి ఆదేశం ప్రకారం ఆర్టీసీ సంస్థను ప్రభుత్వం లో విలీనం చేయాలని, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం రోజున ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయాలని కోరారు.

ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1న ప్రతి ఆర్టీసీ ఉద్యోగి, సిబ్బంది రెడ్ బ్యాడ్జ్ లు ధరించి విధులకు హాజరయ్యారు. ఉదయం, మధ్యాహ్నం మొదటి బస్సు నుంచి ప్రతి ఒక్కరూ రెడ్ బ్యాడ్జి ధరించి విధులకు హాజరయ్యారు. హయత్ నగర్ డిపో 1, 2లో సోమవారం కార్మికులు, ఉద్యోగులను ఆయన కలిశారు. ఈ కార్యక్రమంలో హయత్ నగర్ డిపో టీఎంయూ సెక్రెటరీ మైస నరేష్, సీనియర్ నాయకులు కరుణ నిర్మల, రాధ, సుశీల, రాజేశ్, పాండు, యాదగిరి, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.