2 June, 2026 | 4:39 AM

పీర్జాదిగూడలో ఘనంగా బీరప్ప కామరాతి కల్యాణ మహోత్సవం

02-06-2026 12:00 AM

మేడిపల్లి, జూన్ 1 (విజయక్రాంతి): పీర్జాదిగూడలో నిర్వహించిన బీరప్ప కామరాతి కల్యాణ మహోత్సవంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆర్.వి. ఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి పాల్గొని, మొక్కులు చెల్లించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ,బీరప్ప కామరాతి కల్యాణ మహోత్సవం మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక.

ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయి. యువత మన ఆచారాలను, సంప్రదాయాలను పరిరక్షిస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ప్రజలందరికీ బీరప్ప స్వామి ఆశీస్సులు లభించి సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను  అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కుర్ర శ్రీకాంత్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు,  స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.