6 May, 2026 | 5:41 PM

Breaking News

క్రీడా శాఖ డిప్యూటీ డైరెక్టర్ కు ఘన సత్కారం   •   రైతులకు రుణాలు, కొనుగోలు కేంద్రాలపై అవగాహన   •   సామల వారి వివాహ వేడుకకు కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్నూలే నారాయణ హాజరు   •   కోనరావుపేట పీఏసీఎస్ నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించాలి… సీపీఐ ధర్నా   •   పంట సాగుపై రైతులకు అవగాహన   •   కోనరావుపేటలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు –అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నాగండ్ల దీపక్ చౌదరి   •   పిఏసిఎస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఏగుల నరసింహులు,వైస్ చైర్మన్   •   కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు నీడ కల్పించాలని ఇందిరమ్మ పథకం   •  

బురదమయంగా రోడ్డు.. రైతులకు ఇబ్బందులు

27-12-2025 12:27 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), డిసెంబర్26: మండల పరిధిలోని కొమ్మాల గ్రామం నుండి తుంగతుర్తి మండలం బోరబండ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో గల కుమ్మరివారి కుంట సమీపంలోని అలుగు మీదుగా వెళ్లే రహదారి పూర్తిగా బురదతో నిండి రోడ్డు అద్వాన్నంగా మారడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ రహదారి మీదుగా ప్రతిరోజూ వందలాది మంది రైతులు,రైతు కూలీలు పొలాలకు వెళ్లడం, పొలంలో పండిన ధాన్యాన్ని ఈ దారి గుండానే తరలించాల్సి ఉంది. ఈ దారి గుండా ప్రయాణించాలంటే ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, ఆటోలు బురదలో దిగబడడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు వాపోతున్నారు.తక్షణమే అధికారులు,ప్రజాప్రతినిధులు స్పందిం చి కల్వర్టు నిర్మాణం చేసి,ప్రయాణాన్ని సులభతరం చేయాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.