పురుషః వచ్చేది అప్పుడే
కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు ‘పురుషః’ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్‌కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతున్న ఈ మూవీకి వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, వీటీవీ గణేశ్, స ప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, వి షిక, హాసిని సుధీర్ వివిధ పాత్రలను పోషించారు. ఇప్పటికే పోస్టర్లు, పాటలు, గ్లింప్స్, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి.
తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. వేసవి కానుకగా మే 22న ఈ మూవీని రిలీజ్ చేయబోతోన్నారు. కుటుంబమంతా కలిసి నవ్వుతూ వినోదం పొందేలా ఈ చిత్రం ఉంటుందని టీమ్ పే ర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సతీశ్ ముత్యాల, సంగీత దర్శకుడుగా శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్‌గా కోటి, ఆర్ట్ డైరెక్టర్‌గా రవిబాబు దొండపాటి పనిచేస్తున్నారు.






