ఆ పాత్రకు నేను సరిపోలేదని ముందే అనిపించింది!
సాయిపల్లవి ‘ఏక్ దిన్’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిశ్రమ ఫలితానికే పరిమితమైంది. ఈ చిత్రంలో ఆమిర్‌ఖాన్ తనయుడు జునైద్‌కు జోడీగా నటించింది సాయిపల్లవి. తాజాగా ఈ సినిమాను అంగీకరించడంపై సాయిపల్లవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. “ఏక్ దిన్’ చేయడానికి స్క్రిప్టే ప్రధాన కారణం. చిత్రబృందం నన్ను సంప్రదించిన టైమ్‌లో నేను చాలా ఎమోసనల్ సినిమాల్లో నటిస్తున్నా.
మనసుకు హాయిగా అనిపించే పాత్రలు చేయా లనుకున్నా. షూటింగ్ సమయంలోనూ, ఆ తర్వాత కూడా ఎలాంటి మానసిక ఒత్తిడి లేని తేలికపాటి కథ చేయాలని అనుకున్నా. ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు హాలీవుడ్ క్లాసిక్ ‘బిఫోర్ సన్‌రైజ్’ గుర్తుకు వచ్చింది. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను ఓకే చేశా. ప్రీమియర్ షో చూసిన తర్వాత ఈ పాత్రకు నేను సరిపోలేదని నాకు అనిపించింది. ఇదే మాట ఆమి ర్ ఖాన్‌తోనూ చెప్పా. ‘ఈ పాత్రకు నన్ను కాకుండా మరొకరిని ఎంపిక చేసి ఉంటే బాగుండేదేమో. చురుగ్గా, హుషారుగా ఉండే కొత్త అమ్మాయిని ఎంపిక చేసి ఉండాల్సింది. వాళ్లు ఈ పాత్రకు బాగా న్యాయం చేసేవాళ్లు’ అని నా మనసులో మాటను ఆమిర్‌తో పంచుకున్నా” అని తెలిపింది.






