11 May, 2026 | 4:02 AM

ఉద్యమకారులకిచ్చిన హామీలు అమలుచేయాలి

11-05-2026 01:43 AM

లేకుంటే జూన్ 2 తరువాత ఉద్యమకారులతో కలిసి ప్రత్యక్ష ఆందోళన

టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

తెలంగాణ ఉద్యమకారులతో సహపంక్తి భోజనం

హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుకు జూన్ 2 వరకు గడువు ఇస్తున్నామని, అప్పటికీ హామీలు అమలు చేయకుంటే ఉద్యమకారులతో కలిసి ప్రక్యక్ష ఆందోళనలు చేపడతామని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.

జార్ఖండ్ ప్రభుత్వం ఉద్యమకారులకు అందిస్తున్న సంక్షేమ పథకాల తరహాలో తెలంగాణలో ఉద్యమకారులకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్‌ చేశారు. సమావేశం అనంతరం ఉద్యమకారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు రూప్‌సింగ్, సయ్యద్ ఇస్మాయిల్, మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సామ అంజిరెడ్డి, ఉపాధ్యక్షుడు మూల ప్రభాకర్‌గౌడ్, కార్యదర్శులు వి. రాజేశ్, శ్రీనివాస్‌రెడ్డి, ఉద్యమకారుల జేఏసీ అధ్యక్షురాలు బి. పద్మ, గుస్సా రవీందర్, అరుణ, ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు పూస శ్రీనివాస్, కొడిమల కృష్ణ, డీఎస్ మాణిక్యమ్మ, తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు రామగిరి ప్రకాశ్, ఉపాధ్యక్షులు బీరకాయల మధుసూదన్, భరత్‌రెడ్డి, తొలి దశ ఉద్యమకారుల సంఘం ఉపాధ్యక్షులు సాజిద సికిందర్, శ్రీవల్లి, తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్ కే సత్యనారాయణ పాల్గొన్నారు.