గద్వాల ఎమ్మెల్యేను కలిసిన విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు
27-07-2026 02:33 AM
గద్వాల టౌన్ జూలై 26: జోగులాంబ గద్వాల జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కలిసి సన్మానించారు.ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణుల సంక్షేమం,సంప్రదాయ కులవృత్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.వినతిపై స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వ సంక్షేమ పథకాలు విశ్వబ్రాహ్మణులకు అందేలా కృషి చేస్తానని వారి సమస్యల పరిష్కారానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సూర్యప్రకాశ్,ప్రధాన కార్యదర్శి రాంప్రసాద్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.






