27 July, 2026 | 12:35 AM

దళారి వ్యవస్థకు చెక్!

27-07-2026 12:00 AM
  1. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో చర్యలు
  2. పారదర్శకత కోసం ఆంక్షలు

కరీంనగర్, 26(విజయక్రాంతి):కరీంనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అనధికార ప్రవేశాలను నియంత్రించడానికి దళారీ వ్యవస్థను అరికట్టడానికి తాజాగా అధికారులు ఆంక్షలు విదించారు.కార్యాలయంలో పారదర్శకత పెంచడం.దళారులను నిరోధించడం.నేరుగా వచ్చే భూ యజమానులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.  ఈ క్రమంలోనే రిజిస్ట్రేషన్ ఆఫీసులో కి రైటర్లకు ’నో ఎంట్రీ విధించారు.ఇటీవల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారులుడాక్యుమెంట్ రైటర్ల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరగా,

ఆఫీసు ప్రతిష్ట దెబ్బతింటుందనే కారణంతో రైటర్ల ప్రవేశంపై అధికారులు ఆంక్షలు విధించారు. వివాదంతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలు గంటల తరబడి నిరీక్షిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ లో 20 మంది వరకు డాక్యుమెంటరీ రైటర్లు ఉంటారు. పడిరోజులుగా వీరి సేవలు నిలిచి పోయాయి. కలెక్టర్ తో పాటు స్టాంప్స్ & రిజిస్ట్రేషన్స్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రైటర్లు కోరుతున్నారు. 

అసౌకర్యం కలుగుతుందనే..

డాక్యుమెంట్ రైటర్స్‌ను లోపలికి అనుమతించక పోవడానికి గల కారణం రిజిస్ట్రేషన్ పార్టీలతో పాటుగా డాక్యుమెంట్ రైటర్స్ కూడా వచ్చి కార్యాలయ సిబ్బందితో మాట్లాడడం ఒక కారణం .పనిలో జాప్యత జరుగుతుండడంతో మిగతా వారికి అసౌకర్యము కలుగుతుందనే ఉద్దేశంతో వారిని లోపలికి అనుమతించడం లేదు .ఇది పై అధికారుల ఆదేశాలతో అనుమతించడంలేదు. -

ముబశీర్ ,సబ్ రిజిస్ట్రార్ కరీంనగర్

అధికారులకు ప్రజలకు అనుసంధాన కర్తలం

 దస్తావేజు లేఖరులు రిజిస్ట్రేషన్ కి వచ్చే ప్రజలకి, రిజిస్ట్రేషన్ అధికారులకు మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తూన్నాము. జనాలకు సంబందించిన రిజి స్ట్రేషన్ పనులు దగ్గరుండి చేపిస్తుంటా రు దానికి రిజిస్ట్రేషన్ చేపించుకున్న పా ర్టీలు ఇచ్చే ఫీజుతో లేఖరులు ఉపాధి పొందుతున్నారు. కానీ ఎవరో ఒకరు చేసిన తప్పిదాన్ని అందరికి ఆపాదించండం సరైనది కాదు.- 

అక్కనపల్లి కుమార్, దస్తావేజు లేఖరుల సంఘం ఉమ్మడి జిల్లా నాయకులు