11 May, 2026 | 5:15 AM

కులగణన చేయాల్సిందే

11-05-2026 01:45 AM

లేదంటే ప్రధాని మోదీ ఇంటిని ముట్టడిస్తాం

గన్‌పార్క్ వద్ద ఆందోళనలో అఖిలపక్ష నేతల హెచ్చరిక

బీసీలను పట్టించుకోని బీసీ ప్రధాని 

బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్

ముషీరాబాద్, మే 10 (విజయక్రాంతి): దేశంలో కులగణన చేపట్టాల్సిందేనని, లేదంటే ప్రధాని మోదీ ఇంటిని ముట్టడిస్తామని అఖిలపక్ష నేతలు హెచ్చరించారు. బీజేపీ ఆవిర్భా వం నుంచి నేటి వరకు బీసీలకు అన్యాయం చేస్తూనే ఉందని, బీసీలకు ద్రోహం చేస్తున్న బీజేపీ చరిత్రలో పతనం గాక తప్పదన్నారు.

జాతి జనగణనలో సమగ్ర కులగణన చేపడతామన్న ప్రధాని హామీ విస్మరించినందుకు ఆదివారం ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు.

హైదరాబాదులోని గన్‌పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జాజుల శ్రీనివాస్ గౌడ్, షాద్‌నగర్ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్, సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం బీజేపీ విధానాలపై విరుచుకుపడ్డారు.

ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అబ్బాస్, బీసీ సాధన కమిటీ అధ్యక్షులు ధనుంజయ నాయుడు,, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, కేతురు వెంకటేష్, తాటికొండ విక్రమ్ గౌడ్, ధనలక్ష్మి, ఉప్పరి శేఖర్ సగర, పగిళ్ల ఆశన్న, మని మంజరి, రావులకోల్ నరేష్ ప్రజాపతి, జాజుల లింగం, జిల్లాల నరసింహ, కవుల జగన్నాథం, రాజు యాదవ్, స్వర్ణ గౌడ్, గూడూరు భాస్కర్ మేరు, సత్యరాజ్ గౌడ్, గౌతమి, ఇంద్రం రజక, గుంటి మహేష్, తదితరులు పాల్గొన్నారు.