7 May, 2026 | 4:04 AM

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి

07-05-2026 12:00 AM

కలెక్టర్ స్నేహ శబరిష్

మహబూబాబాద్, మే 6 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధికారులకు ఆదేశాలిచ్చారు. బుధవారం జిల్లా కలెక్టర్ గంగారం , మహబూబాబాద్ మండలాలలో విస్తృతంగా పర్యటించారు. మహబూబాబాద్ మండలం అమనగల్, పర్వతగిరి గ్రామాలలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలను సందర్శించారు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని ప్రభుత్వం సూచించిన ప్రకారం కొనుగోలు చేసి వెంటవెంటనే మిల్లులకు తరలించాలని,

ప్రస్తుతం అకాల వర్షాలు పడే సూచన ఉన్నందున వ్యవసాయ శాఖ అధికారులు రైతులను అప్రమత్తం చేయాలని, కేంద్రాలలో గన్ని సంచులు, టార్పాలిన్లు, ప్యాడి క్లీనర్స్, సిద్ధంగా ఉంచుకోవాలని, త్రాగునీరు, టెంట్, చైర్స్ వైద్య సేవలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు, సహకార 151,  ఐకెపి 53, మెప్మా1, గిరిజన కార్పొరేషన్ 8,  శాఖల ఆధ్వర్యంలో 213 కేంద్రాలు నిర్వహించడం జరుగుతుందని అట్టి కేంద్రాల ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 22 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందన్నారు  జిల్లా లక్ష్యం పూర్తి చేయుటకు అధికారులందరూ సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకోవాలని, కేంద్రాల నిర్వహణ, ధాన్యం కొనుగోళ్ల లో రైతులను ఇబ్బంది పెట్టితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఏదైనా అత్యవసర పరిస్థితులు ధాన్యం కొనుగోళ్లు, రవాణా తదితర సంబంధిత విషయాలలో సమస్యలు ఉంటే వెంటనే 7995050789 హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయాల్సిందిగా కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు, డీఎస్‌ఓ రమేష్, డీఎం సివిల్ సప్లై నరసింహారావు, తహసిల్దార్లు, బాలకిషన్, రాజేశ్వరరావు, ఎంపీడీవో వైష్ణవి, సంబంధిత సిబ్బంది ఉన్నారు.