24-02-2026 12:08:14 AM
అడ్డాకుల, ఫిబ్రవరి 23 : నాగర్ కర్నూల్ జిల్లా కమ్మెర గ్రామంలో మల్లన్న దర్శనం కోసం వెళ్లిన రజక కులానికి చెందిన చంద్రకళ కుటుంబంపై దాడిచేసి, రెండు నెలల పసిపాప మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని అడ్డాకుల కెవిపి ఎస్ ప్రధాన కార్యదర్శి బాలరాజు, ప్రసాద్ , సామెల్ డిమాండ్ చేశారు. సోమవారం అడ్డాకుల మండల కేంద్రంలో ఆర్టీసీ కెవిపిఎస్ ఆధ్వర్యంలో పసిపాప మృతికి కారణమైన వారిని శిక్షించాలంటూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలరాజు , ప్రసాద్,రజక కులానికి చెందిన చంద్రకళ కుటుంబంతో మల్లన్న దేవుని దర్శనానికి వెళుతుండగా కొంతమంది అగ్రకులానికి చెందిన వారు అడ్డుకొని, రెండు నెలల పసికందు ఉందని కూడా చూడకుండా దాడికి పాల్పడటంతో పాప మృతి చెందిందన్నారు.
ఇందు కు శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కానీ రెడ్డి, మరికొందరు పై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధిక చట్టంతో పాటు హత్య నేరం కింద కేసు నమోదు చేసి 24 గంటల్లో తక్షణమే రిమాండ్ చేయాలని రాష్ట్ర పోలీస్ ఉన్నంత అధికారులను డిమాండ్ చేశారు. కారకులైన వారిని కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలని డిమాం డ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు రామాంజనేయులు, రాజేష్, రమేష్, రాజు, చిన్న నరసింహులు, ఏసేపు పాల్గొన్నారు.