5 July, 2026 | 2:09 PM

బేల నుంచి పండరీపూర్ కు భక్తుల పాదయాత్ర ప్రారంభం

05-07-2026 01:26 PM

బేల,(విజయక్రాంతి): ఆషాఢి ఏకాదశి సందర్భంగా మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యకేత్రం పండరీ పూర్‌కు భక్తులు పాదయాత్రగా బయలుదేరారు. బేల మండల కేంద్రం నుంచి మహారాష్ట్రలోని పవిత్ర పుణ్యక్షేత్రం పండర్‌పూర్ వైపు భక్తుల పాదయాత్ర పల్లకి ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. విఠల్-రుక్మిణి బాయి దర్శనం కోసం బయలుదేరిన భక్తులు భజనలు, సంకీర్తనలతో దారిపొడువున ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు భగవాన్ నామస్మరణ చేస్తూ భక్తి పారవశ్యంలో ముందుకు సాగారు. పల్లకితో పాటు కాషాయ జెండాలు చేతబట్టి మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామస్తులు పాదయాత్రికులకు ఘనంగా వీడ్కోలు పలికి, వారి యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ పాదయాత్ర ఆషాఢి ఏకాదశి సందర్భంగా పండర్‌పూర్ చేరుకుని శ్రీ విఠోబా స్వామిని దర్శించుకుకోవడం అనవాయితీగా వస్తుంది.