25 August, 2026 | 3:34 PM

Breaking News

అవుట్‌డోర్ ఎలక్ట్రికల్ ఉద్యోగులకు కన్వీనియన్స్ వెహికల్ ఏర్పాటు చేయాలి   •   పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి   •   ఆల్ ఇండియా బీడీ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడి గా గోవర్ధన్   •   ప్రకృతిని మనం నాశనం చేస్తే.... ప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది   •   ప్రకృతిని మనం నాశనం చేస్తేప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది   •   సీతారాంపల్లి లో మొక్కలు నాటిన గ్రామ నాయకులు   •   నషాముక్త్‌ భారత్‌ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి   •   పంటల మార్పిడితోనే వ్యవసాయం లాభసాటి   •   వన మహోత్సవంలో నాటిన ప్రతి మొక్కను రక్షించాలి   •   మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత   •  

మేడిగడ్డ బ్యారేజీకి పెరుగుతున్న వరద

05-07-2026 02:53 PM

హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి, గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతుంది. మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో మేడిగడ్డ బ్యారేజీకి 90,580 క్యూసెక్యులు ప్రవాహం నిరంతరాయంగా కొనసాగుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమై బ్యారేజీ దెబ్బతిన్నప్పటి నుంచే 85 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో సమానంగా కొనసాగగా, 62,700 క్యూసెక్కుల వరద నీరు ఎగువ నుంచి వచ్చి చేరుతోంది.