వెంకటాపురం గ్రామంలో సిసి రోడ్డుకు శంకుస్థాపన
ఎర్రుపాలెం,(విజయ క్రాంతి): మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో ఆదివారం నాడు గ్రామ సర్పంచ్ బొగ్గులు గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సీసీ రోడ్డు శంకుస్థాప చేశారు. రాజుపాలెం సొసైటీ కార్యాలయం నందు మొక్కలు నాటారు. కార్యక్రమంలో మధిర,ఏఎంసి చైర్మన్ బండారు నరసింహారావు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి , ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి , రాజుపాలెం సొసైటీ అధ్యక్షులు వెన్నపూస కృష్ణారెడ్డి ,మండల ఉపాధ్యక్షులు శీలం శ్రీనివాస్ రెడ్డి ,మండల క్రమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అధ్యక్షుడు కర్నాటి సుధాకర్ రెడ్డి , మరియు వెంకటాపురం గ్రామ శాఖ అధ్యక్షులు ఎర్రు వెంకటేశ్వరరావు , వై. శ్రీనివాసరెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు రమేష్ మరియు వివిధ హోదాలలో ఉన్న మండల ,గ్రామ నాయకులు పాల్గొన్నారు.






