calender_icon.png 24 February, 2026 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని పాదయాత్ర

24-02-2026 12:09:23 AM

రాజాపూర్, ఫిబ్రవరి 23: తెలంగాణ రాష్ట్ర తొలి  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని అంకిళ్ళ గ్రామం నుండి తెలంగాణ భవన్ వరకు పాదయాత్ర చేస్తున్న  రామచందర్ పాదయాత్ర సోమవారం రాజాపూర్ మండల కేంద్రానికి చేరుకున్నాడు.

బీఆర్‌ఎస్ నాయకులు, రాజాపూర్ గ్రామ మాజీ సర్పంచ్, సర్పంచ్ ల సంఘం మండల మాజీ అధ్యక్షులు కప్పెరి బచ్చిరెడ్డి, బీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షులు వనపర్తి సత్తయ్య, బీఆర్‌ఎస్ లీడర్ గుమ్మడవెల్లి అచ్చయ్య తదితరులు శాలువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు.  పాదయాత్ర చేస్తున్న రామచంద్రరావును అభినందించి పాదయాత్ర సజావుగా సాగి గమ్యాస్థానానికి సురక్షితంగా చేరుకోవాలని ఆకాంక్షించారు.