5 July, 2026 | 2:12 PM

ఎన్ని అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి చేరుకుంటాం

05-07-2026 01:23 PM

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బృందం హైదరాబాద్ నుండి బయలుదేరింది.  జనగాం సమీపంలోని పెంబర్తి వద్ద హైవే మీద కేటీఆర్ కాన్వాయ్ కు బారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకొని, భారీ కాన్వాయ్ కు అనుమతి లేదని చెప్పారు. అన్ని కార్లను అనుమతించాల్సిందేనని పోలీసులకు కేటీఆర్, బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. 

పెంబర్తి వద్ద హైవే మీద బారికేడ్లు పెట్టి అడ్డుకున్న సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటనను అడ్డుకోవడానికి కాంగ్రెస్ సర్కార్ శతవిధాలా ప్రయత్నిస్తుందని, కాంగ్రెస్ సర్కార్ పోలీసులను పెట్టి ఎంత అడ్డుకునే ప్రయత్నం చేసినా తప్పకుండా కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు చేరుకుంటామన్నారు. వృథాగా పోతున్న లక్ష క్యూసెక్కుల కాళేశ్వరం జలాలను రైతులకు చూపెడుతాం. నీళ్లను ఎత్తిపోయకుండా రైతుల పొలాలను ఎండబెట్టే కుట్ర చేస్తున్న రేవంత్ సర్కార్ దుర్మార్గపు వైఖరిని ఎండగడతాం! అని ఆయన చెప్పారు.