9 May, 2026 | 10:25 AM

Breaking News

గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •   రైతులకు మద్దతు ఏదీ?   •   ఇంటర్ విద్యకు మంగళం!   •  

ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ సహకారంతో కోదాడ పట్టణాన్ని అభివృద్ధి చేస్తా

24-02-2026 12:08 AM

మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ

కోదాడ, ఫిబ్రవరి 23: కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ సహకారంతో కోదాడ పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు అన్నారు. సోమవారం కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ సమక్షంలో మున్సిపల్ చైర్ పర్సన్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు.

అంతకు ముందు శ్రీరంగాపురం అభయాంజనేయ స్వామి 23వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. భాధ్యతల స్వీకరణ అనంతరం ఆమె మాట్లాడుతూ తనకు మునిసిపల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి, మంత్రి ఉత్తమ్ కి ఋణపడి ఉంటానన్నారు. కాగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ కుసుమ వెంకట్ రత్నం బాబు, వైస్ చైర్మన్ దేవర పల్లి మల్లేశ్వరి లను ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ గజమాల తో అభినందించారు.

కాగా చైర్మన్, వైస్ చైర్మన్ లను మాజీ ఎమ్మెల్యే చందర్ రావు, , కౌన్సిలర్ లు నాయకులు అభిమానులు కార్య కర్తలు తదితరులు శుభా కాంక్షలు తెలిపారు. కోదాడ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గా భాధ్యతలు స్వీకరించిన దేవర పల్లి మల్లేశ్వరి మాట్లాడుతూ తన ఎంపిక కు సహాకారం అందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల కు కృతజ్ఞతలు తెలిపారు. కోదాడ పట్టణ అభివృద్ధికి పాలక వర్గం తో కలిసి కృషి చేస్తానన్నారు.