8 May, 2026 | 3:00 PM

Breaking News

ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ఉర్దూ పోస్టర్‌ ఆవిష్కరణ   •   తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుతో ప్రాణహిత జలాలకు వినియోగం: మంత్రి జూపల్లి కృష్ణారావు   •   పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత   •   పుల్లాయిగూడెం నూతన రామాలయం ప్రారంభోత్సవం   •   కొడంగల్‌లో శ్రీవేంటేశ్వర స్వామి ఆలయానికి సీఎం భూమిపూజ   •   జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య   •   ఎస్ పీఎల్ క్రికెట్ విజేతకు లక్ష నగదు, ట్రోఫీ అందజేత   •   రాస్తారోకో నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు   •   వేసవి శిబిరం సద్వినియోగం చేసుకోగలరు: ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి   •   కొలనూరు చెరువు వద్ద రైతు వారోత్సవాలు నిర్వహణ   •  

అత్యంత హృదయ విదారక ఘటన

18-11-2025 12:55 AM
  1. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలి
  2. బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు

హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): సౌదీ అరేబియాలో బస్సు ప్రమా దం ఘటనపై బీజేపీ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సోమవారం ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. సౌదీ అరేబియాలో చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదంలో ప్రయాణికులు, తెలంగాణవాసులు దుర్మరణం చెందడం అత్యంత హృదయ విదారకమైన ఘటన అన్నారు.  ఈ ఘటన రాష్ట్రాన్ని తీవ్రవిషాదంలోకి నెట్టిందని, ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని, వారి కుటుంబాల పట్ల బీజేపీ తెలంగాణ రాష్ర్ట శాఖ సంతాపం వ్యక్తం చేస్తోందన్నారు. 

మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాద సమయం లో భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రమాదం అనంతరం కేంద్ర విదేశాంగ శాఖ అత్యంతవేగంగా చర్యలు ప్రారంభించిందని, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రంతో సమన్వయం చేసి, మృతదేహాల తరలింపు సహాయక చర్యలను వేగవంతం చేయాలని కోరారు.