26 June, 2026 | 1:56 AM

శిశు మరణాల రేటు తగ్గించాలి

26-06-2026 12:45 AM

డీఎంహెచ్వో డాక్టర్ కే ప్రమోద్ కుమార్

పెద్దపల్లి, జూన్25 (విజయక్రాంతి): జిల్లాలో శిశు, నవజాత శిశు మరణాల రేటు సింగిల్ డిజిట్ స్థాయికి తీసుకరావాలని డీఎంహెచ్వో డాక్టర్ కే ప్రమోద్ కుమార్ సూ చించారు. కలెక్టరేట్లో గురువారం సంకల్ప్ కార్యక్రమం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు.

గర్భిణీలను ప్రారంభ దశలోనే నమోదు చేయడంహై రిస్క్ ప్రెగ్నెన్సీల గుర్తింపు, పర్యవేక్షణ తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో వైద్యులు శ్రీరాములు, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.