టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో తనిఖీలు
బోయినపల్లి జూన్ 25 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో టాస్క్ పోర్స్ వ్యవసాయ శాఖ అధికారులు మండలంలో గురువారం ఎరువుల, విత్తనాల దుకాణాలను తనిఖీ చేశారు. వ్యవసాయ అధికారి ప్రణీత, ఎస్త్స్ర రమాకాంత్ కలిసి మండలం లోని పలు దుకాణాల్లో విత్తన మరియు ఎరువుల నిల్వలను పరిశీలించారు.
ఈ సందర్భంగా దుకాణదారులు తప్పనిసరిగా యూరియా ను యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న రైతులకు మాత్రమే అమ్మాలని సూచించారు. ఈ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ గత యాసంగి లోనే మన మండలం లో అమలుపరచారని, 2471 మంది రైతులు 8724 బస్తాలను యాప్ ద్వారా బుక్ చేసుకుని కొనుగోలు చేశారని చెప్పారు.
ఈ వానకాలం లో కూడా ఈ రోజు వరకు 1032 మంది రైతులు 3375 యూరియా బస్తాలను యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్నారని తెలిపారు.కాబట్టి అందరూరైతులు యూరియా కొనుగోలు తప్పనిసరిగా ఫర్టిలైజర్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకొని మాత్రమే కొనుగోలు చేయాలనీ సూచించారు.
ఈ యాప్ నీప్లే స్టోర్ ద్వారా లేదా లింక్ ద్వారా లేదా మీ సమీప ఎరువుల దుకాణదారుని ద్వారా లేదా వ్యవసాయ శాఖ సిబ్బంది ద్వారా కానీ ఈ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ను మీ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుని మీ పంట వివరాలను ధృవీకరించి యూరియా బస్తాలని బుకింగ్ చేసుకోవచ్చని చెప్పారు. ప్రతి రోజు ఉదయం 6 గంటలకి మరియు మధ్యాహ్నం 3 గంటలకి కొత్తగా వచ్చిన యూరియా బస్తాలను యాప్ లో చూపించడం జరుగుతుంది, ఈ స్టాక్ ను రైతులు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు బుక్ చేసుకోవచ్చని చెప్పారు.






