26 June, 2026 | 1:58 AM

చేనేత సహకార సంఘం నూతన పాలకవర్గం ఎన్నిక

26-06-2026 12:47 AM

మానకొండూరు, జూన్ 25 (విజయక్రాంతి): కొండపల్కల చేనేత సహకార సంఘ నూతన పాలకవర్గ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులను గురువారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా దాసరి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు, ఆడెపు రాజు, కోశాధికారి, బొమ్మ మొగిలి, పాలకవర్గం సభ్యులుగా, గడ్డం నరేందర్, అంకం సంపత్, దాసరి గణేష్, ఆడెపు సత్తయ్య, మాటేటి కనకలక్ష్మి, ఆడెపు పద్మలు ఎన్నికయ్యారు. కొండపల్కల చేనేత సహకార సంఘ పరిధిలో ఎలబాక, గంగారం, మద్దికుంట, కెల్లేడు, దేవంపల్లి, గంగిపల్లి, కొండపల్కల గ్రామాలున్నాయి.