గోవుల అక్రమ రవాణా అరికట్టాలి
బోధన్ ఆర్డీఓకు వీహెచ్‌పీ భజరంగ్ దళ్ వినతిపత్రం
బోధన్:మే18(విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని కార్యాలయంలో ఆర్టీవో విజయకుమారికి విహెచ్పి, భజరంగ్ దళ్ నాయకులు సోమవారం మధ్యాహ్నం వినతి పత్రం అందజేశారు. గోవుల అక్రమ రవాణా, గోవదిన అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి హిందూ మనోభావాలను దెబ్బతీసే చర్యలు సహించేది లేదురు.
బోధన్ మండలంలో విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ గోసేవ-గోరక్ష విభాగం ఆధ్యర్యంలో సోమవారం బోధన్ ఆర్టీవో కార్యాలయంలో విజయకుమారికి వినతిపత్రం సమర్పించారు. రాబోయే బక్రీద్ పండుగ నేపధ్యంలో గోవుల అక్రమ రవాణా, వధలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని వారు అధికారులను కోరారు.
బోధన్ పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో గోవులను అక్రమంగా తరలిస్తూ వధిస్తున్నారనే సమాచారం తమకు అందుతోందని నాయకులు తెలిపారు. హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎలాంటి చర్యలు జరిగినా సహించబోమని హెచ్చరించారు. గోవుల సంరక్షణ కోసం ప్రత్యేక నిమా బృందాలను ఏర్పాటు చేసి, అక్రమ రవాణాపై కరిస చర్యలు తీసుకోవాలని అధికారులను విజ్ఞప్తి చేశారు.






