19 May, 2026 | 2:10 AM

నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేసిన సర్పంచ్

19-05-2026 12:59 AM

నాగిరెడ్డిపేట్,మే18 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కృషి ఫలితంగా నాగిరెడ్డిపేట్ మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామంలో లబ్ధిదారులు జగ్గని యశోద మంజూరైన నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం గ్రామ సర్పంచ్ మన్నె వెంకట్ గ్రామ కాంగ్రెస్ నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మన్నే వెంకట్ మాట్లాడుతూ...పేద ప్రజల కలలు సాకారం చేయడం కోసమే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకు రావడం జరిగిందని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు సొంత ఇల్లు ఉండాలని, అర్హులైన నిరుపేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మంజూరు చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మన్నె వెంకట్, గ్రామ కాంగ్రెస్ నాయకులు నర్సింహారెడ్డి,సాయ గౌడ్, గ్రామస్తులు ఉన్నారు.