19 April, 2026 | 2:14 AM

వడగండ్లు, ఈదురు గాలుల బీభత్సం

19-04-2026 12:52 AM
  1. నేలకూలిన భారీ వృక్షాలు
  2. మరిమడ్ల-నిమ్మపల్లి రహదారిపై రాకపోకలు బంద్ 

కోనరావుపేట/నిజామాబాద్/రాజన్నసిరిసిల్ల, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల్లో శనివారం సాయంత్రం వడగండ్లు, గాలివాన బీభత్సం సృష్టించింది. ఈ అకాల వర్షం పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలుల తీవ్రతకు మరిమడ్ల ప్రధాన రహదారిపై ఇరువైపులా ఉన్న భారీవృక్షా లు నేలకూలాయి. దీంతో ఈ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలంలో ని మరిమడ్ల గ్రామంలో వడగళ్ల వర్షం కురిసింది. ఈదురుగాలులు బలంగా వీచాయి. ఈ అకాల వాన, గాలులు రైతు లను నట్టేట ముంచాయి. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలుల తీవ్రతకు మరిమడ్ల-నిమ్మపల్లి ప్రధాన రహదారిపై ఇరువైపులా ఉన్న భారీ వృక్షాలు విరిగి, రోడ్డుమీద కూలిపోయాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.

రాజన్న సిరిసిల్ల, నిజామాబా ద్ జిల్లాల వైపు వెళ్లే వాహనాలు అలాగే మండల కేంద్రానికి వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని గమ నించిన స్థానికులు, వాహనదారులు స్వచ్ఛందంగా ముం దుకు వచ్చి రహదారిపై పడిన చెట్లను తొలగించించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వడగండ్లు వానకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

23 వరకు వర్షాలే

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): నిన్నటి వర కు భానుడి తన ప్రతాపం కొనసాగితే.. శనివారం సాయం త్రం ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షా లు కురిశాయి. ఈనెల 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది.

ఈ మేరకు ఆదివారం భూపాలపల్లి, ములు గు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌లను జారీ చేసింది. మిగ తా రోజుల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పలు జిల్లాల్లో కురుస్తా యని తెలిపింది. ఇదిలా ఉంటే శనివారం ఆదిలాబాద్ జిల్లాలో 44.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.