మొక్కజొన్న ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
21-04-2026 03:09 AM
బిజినపల్లి, ఏప్రిల్ 20: రైతులు పండించిన మొక్కజొన్న ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్ డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో బిజినపల్లి మండల కేంద్రంలో మొక్కజొన్న రైతుల సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఒక ఎకరానికి కేవలం 26 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని నిబంధన పెట్టడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దళారులు క్వింటాలుకు 17 వేలు మాత్రమే ధర ఇస్తూ రైతులను నష్టపరుస్తున్నారని కొనుగోలు కేంద్రాల్లో సంచుల కొరత కూడా తీవ్రంగా ఉందని, ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు బోనాసి శుభకర్ తదితరులు పాల్గొన్నారు.






