9 July, 2026 | 4:03 AM

సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం

09-07-2026 12:04 AM

ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి 

భూత్పూర్, జులై 8 :  అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం భూత్పూర్ మండల పరిధిలోని పెద్ద తండా గ్రామపంచాయతీ పరిధిలోని లోక్యతాండ లో పలు ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడమే గాక నిరుపేదల సొంత ఇంటి కల నెరవేర్చి పేదల కళ్ళల్లో వెలుగులు నింపుతామని ఎమ్మెల్యే తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మూడవత్ బాలకోటి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కే సి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తో పాటు నాయకులు తదితరులు పాల్గొన్నారు.