9 July, 2026 | 4:49 AM

డ్రా పౌట్‌లు తగ్గాయి

09-07-2026 12:03 AM

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాల ల్లో గతంలో కంటే డ్రాపౌట్ రేట్లు తగ్గా యి. ఈ మేరకు దేశంలోని విద్యావ్యవస్థపై యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్ట మ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ నివేదిక-26లో కేంద్రం వెల్లడించింది. గతంలో కంటే ఈ సారి ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్ రేట్లలో గణనీయమైన తగ్గుదల ఉన్నట్లు తెలిపింది. ప్రాథ మికస్థాయిలో 2024-25లో 2.3 శా తంగా ఉన్న డ్రాపౌట్ రేటు, 2025-26 లో 1.8 శాతానికి తగ్గింది. మాధ్యమిక స్థాయిలో 8.2 నుంచి 7.0 శాతానికి తగ్గింది. ప్రతి ఏడాది కేంద్ర విద్యాశాఖ విడుదల చేస్తోంది.