25 June, 2026 | 3:56 AM

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం

25-06-2026 01:38 AM

గోవిందరావుపేట, జూన్ 24 (విజయక్రాంతి): అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘డ్రగ్ అవేర్నెస్ వీక్2026’ లో భాగంగా గోవిందరావుపేట మండలం పసర పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్పై అవగాహన సదస్సు నిర్వహించారు.

ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆదేశాల మేరకు, డీఎస్పీ రవీందర్ సూచనలతో, సీఐ దయాకర్ పర్యవేక్షణలో, పసర ఎస్‌ఐ తాజుద్దీన్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ ఐ విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

అలాగే డ్రగ్స్ వ్యతిరేకంగా వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులు అందజేశారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని సూచించారు. సమాజంలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.డ్రగ్స్కు సంబంధించిన సమాచారం అందించేందుకు 1908 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉందని తెలిపారు.

అలాగే స్థానిక పోలీసులకు కాల్ లేదా సందేశం ద్వారా సమాచారం అందించవచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యత గా ఉంటాయి నీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చల్వాయి జిల్లా పరిషత్ పాఠశాల హెడ్మాస్టర్ మల్లారెడ్డి. ఉపాధ్యాయులు వాసుదేవ్ రెడ్డి అన్నపూర్ణ. చల్వాయి మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కుమార్, యాంటీ డ్రగ్స్ కోఆర్డినేటర్ ఎస్ భవాని, ప్రాజెక్ట్ నగర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల వార్డెన్ ప్రశాంత్,ఏఎన్‌ఎం ప్రవళిక, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.