15 July, 2026 | 12:27 AM

మల్లయ్య నియామకం గర్వకారణం

15-07-2026 12:27 AM

ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్‌గుప్త

హైదరాబాద్, జూలై 14(విజయక్రాంతి): యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా గుండ మల్లయ్యని నియమించడం పట్ల అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త హర్షం వ్యక్తం చేశారు. నాగోల్‌లోని తన నివాసానికి వచ్చిన సందర్భంగా ఆయన్ని సన్మానించారు.

ఆర్య వైశ్య సమాజానికి చెందిన వ్యక్తికి ఈ గౌరవప్రదమైన బాధ్యతను అప్పగించడం సమాజానికి గర్వకారణమన్నారు. గుండ మల్లయ్య తన అనుభవం, సేవాభావం తో యాదాద్రి దేవస్థానం అభివృద్ధికి విశేషం గా కృషి చేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన గుండ మల్లయ్యకి రెండవ తిరుపతి యాదగిరి గుట్ట ట్రస్ట్ బోర్డ్ మెంబెర్ గా అవకాశం కల్పించడం పట్ల సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా గుండ మల్లయ్యకి ఉప్పల శ్రీనివాస్ గుప్త హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవంతుని ఆశీస్సులతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మిరుడొద్ది శ్యామ్ సుందర్, వాసవి కల్చరల్ కమిటీ అధ్యక్షుడు ఈశ్వర్‌గుప్త పాల్గొన్నారు.