2 September, 2026 | 1:20 AM

జెన్-జడ్ చేతుల్లోనే తెలంగాణ భవిష్యత్తు

02-09-2026 | 12:19am
  1. ఉద్యోగాలు ఇచ్చే యజమానులుగా యువతను తీర్చిదిద్దుతాం
  2. టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
  3. మల్లన్నతో జెన్‌జడ్ యువత సమావేశం

నల్లగొండ, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): రాష్ట్ర భవిష్యత్తును మార్చే శక్తి జెన్-జడ్ యు వత చేతుల్లోనే ఉందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్ల న్న (MLC Teenmar Mallanna) అన్నారు. సోమవారం నల్లగొండలో ని ర్వహించిన జెన్-జడ్ యూత్ మీట్‌లో విద్యార్థులతో ఆయన నేరుగా సంభాషించారు. వి ద్య, ఉద్యోగాలు, రిజర్వేషన్లు, మహిళా భద్ర త, అవినీతి, యువ పారిశ్రామికవేత్తలకు అ వకాశాలు, పాలనలో సామాజిక న్యాయం వంటి అంశాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ ఈ తరం సోషల్ మీ డియా ద్వారా ప్రభుత్వాలను ప్రశ్నించే శక్తిగా ఎదిగిందన్నారు. ఒక లైక్, ఒక షేర్ కూడా ప్రజాస్వామ్య ఆయుధమేనన్నారు.2028 త ర్వాత తమ తొలి ప్రాధాన్యం విద్యా వ్యవస్థ సమూల మార్పుకేనని తెలిపారు. ప్రతి బిడ్డ కు ఉచిత, నాణ్యమైన విద్య, ప్రతి కుటుంబానికి ఉచిత, నాణ్యమైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. విద్య, వైద్య రంగాలకు కలిపి 40 శాతం నిధులు కేటాయిస్తామని చెప్పా రు.

యువతను కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారిగా కాకుండా ఉద్యోగాలు కల్పించే యజమానులుగా తీర్చిదిద్దుతామని మల్లన్న తెలిపారు. అవినీతిపై రాజీపడబోమ ని స్పష్టం చేసిన మల్లన్న, ఒక్కసారి లంచం తీసుకున్నట్లు నిరూపితమైతే ప్రభుత్వ ఉద్యోగాన్ని శాశ్వతంగా కోల్పోయే కఠిన విధానా న్ని అమలు చేస్తామని తెలిపారు. 

మహిళల భద్రత, కుటుంబ సంక్షేమం కో సం రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం అమ లు చేస్తామ ని ప్రకటించారు.రాష్ట్ర శాసనసభలో ఇప్పటివరకు ఒక్క ముస్లిం మహిళకు కూడా ప్రాతినిధ్యం లభించలేదని పేర్కొం టూ, ముస్లిం మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్ర మంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా రా జకీయాల్లో డబ్బు, కులం అడ్డంకులు కావని, ప్రజల విశ్వాసమే ప్రధాన బలమని చెప్పా రు. జీవో 97, పాలిటెక్నిక్ వ్యవస్థ విలీనంపై స్పందిస్తూ విద్యా వ్యవస్థను బలహీనపరిచే నిర్ణయాలను వ్యతిరేకిస్తామని తెలిపారు.

పాలిటెక్నిక్ విద్య ప్రత్యేకతను కాపాడేందుకు శాసన మండలిలో పోరాడతానన్నారు. నో టుకు ఓటు రాజకీయాలను యువతే అడ్డుకోవాలని, కుటుంబాల్లో ఓటు విలువపై చ ర్చ ప్రారంభించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యో గాల కంటే అభ్యర్థుల సంఖ్య అనేక రెట్లు ఎక్కువగా ఉందని, అందువల్ల యువ త వ్యాపార, పారిశ్రామిక రంగాల వైపు అడుగులు వేయాలని సూచించారు.తెలంగాణ కోసం పోరాడిన పేద, బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ కుటుంబాలకు  పూర్తి న్యాయం జరగలేదన్నారు.

ప్రత్యామ్నాయ రాజకీయాలను బలోపేతం చేయాలని  పిలుపునిచ్చా రు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ గుర్తు కత్తెర.. శ్రమజీవుల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. యువత సోషల్ మీడియా ద్వారా ప్రజల గొంతుకగా మారాలని కోరారు.