సీపీఎస్ రద్దు చేయాలి టీజీఈ జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): 2004 సెప్టెంబర్ 1 నుంచి సీపీఎస్ అమలు కావడంతో ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం పెన్షన్‌పై భరోసా(Pension Assurance) లేకుండా పోయిందని టీజీఈ జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీసీఎల్‌ఏ కార్యాలయం ప్రాంగణంలో చేపట్టిన నిరసనలో జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ పాల్గొన్నారు.
ఈసందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ పోరాంటం జీతాల కోసమే కాదని, ఉద్యోగుల భవిష్యత్, వారి కుటుంబాల ఆర్థిక భద్రత కోసమన్నారు. సీపీఎస్‌ను రద్దు చేస్తూ పాత పెన్షన్‌ను అమలు చేయాలన్నారు. సీపీఎస్ లక్షలాది ఉద్యోగుల కుటుంబాల భవిష్యత్‌కు సంబంధించిందని ఆయన తెలిపారు. 2004కు ముందు నోటిఫికేషన్ పడి ఆతర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి కూడా ఓపీఎస్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.






