2 September, 2026 | 12:40 AM

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం

01-09-2026 | 11:54pm

బిజెపి నాయకులు జాకట ప్రేమ్ దాస్

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మేడ్చల్ మున్సిపల్ బిజెపి సీనియర్ నాయకులు జాకట ప్రేమ్ దాస్ ఆరోపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రోజుల పరిపాలనలో కనీసం ప్రజల నిత్యావసరాలను కూడా సక్రమంగా తీర్చలేని పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్ల పరిస్థితి ఆద్వాన్నంగా మారిందని, అండర్ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ప్రేమ్ దాస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

అనేక ప్రాంతాలలో ప్రజలకు త్రాగునీరు సక్రమంగా అందడం లేదని ఆయన స్పష్టం చేశారు.అలాగే విద్యా వ్యవస్థ కూడా నిర్వీర్యమవుతోందన్ని విద్యార్థులకు ఫీజు రీయoబర్స్మెంట్ బకాయిలను సకాలంలో చెల్లించకుండా విద్యార్థుల భవిష్యత్తుతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో అర్హత కలిగిన వృద్ధులు, ఇతర పేదలకు పింఛన్ లు అందించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని జాకట ప్రేమ్ దాస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోచారు.అర్హత ఉన్నటువంటి పేదలకు ఇళ్ళు అందించకుండా ఇళ్ల మంజూరు విషయంలో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని ఆయన వెల్లడించారు.