సబ్‌కో జాన్ దియే నువు పరదేశీ
02-09-2026 | 01:15am
ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda), వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్(Epic): ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ చిత్రం నుంచి నాలుగో పాట ‘సబ్‌కో’ విడుదల చేశారు మేకర్స్.
‘దేశంకాని దేశంలో.. ఏదో వీరావేశంలో.. ఎగిరెగిరే పతంగులురా.. నువ్వునా నేనైనా..’ అంటూ మొదలైన ఈ పాట ‘సబ్‌కో సబ్‌కో జాన్ దియే నువు పరదేశీ..’ అంటూ ఉత్సాహంగా సాగుతోంది. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన ఈ పాటను శ్రీ హర్ష ఇమాని రాయగా.. సంజిత్ హెగ్డే, సితార కృష్ణకుమార్ ఆలపించారు.






