2 September, 2026 | 12:40 AM

విద్యార్థులు పొలం బాట

01-09-2026 | 11:51pm

పంట పొలాల్లో వ్యవసాయంపై అవగాహన.

రాజాపూర్: రాజాపూర్ పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన కోసం మంగళవారం పొలంబాట కార్యక్రమం నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయుడు సాయాతి ఇబ్రహీం తెలిపారు. వ్యవసాయ వృత్తి విద్య విభాగమునకు సంబంధించిన విద్యార్థులు ఈరోజు రాజపూర్ శివారులో రైతుల పొలం సందర్శించి పండిస్తున్నటువంటి వరి, మొక్కజొన్న,జొన్న, పత్తి పంటలను సునిశితంగా పరిశీలించి పంటల వివరాలు సేకరించారు.

 పంట పొలాల్లో అనుసరించినటువంటి వ్యవసాయ పద్ధతులు, నేలస్వభావము‌‍‌, విత్తనాల యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకున్నారు. పంట దిగుబడి పెంచేందుకు వివిధ రకాల రసాయనిక ఎరువులు, సేమ్ టు ఎరువులు ఎలా వాడాలో అడిగి తెలుసుకున్నారు. పంటను మాశించే తెగుళ్ళకు ఏ పురుగుల మందు వాడతారని అడిగి తెలుసుకున్నారు. రైతులు పంటల సాగు ద్వారా ఆర్జించే లాభనష్టాల గురించి తెలుసుకున్నారు. వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా తట్టుకునేటువంటి వంగడాల గురించి అడిగి తెలుసుకున్నారు.

తక్కువ నీరు, తక్కువ పెట్టుబడి తో ఏ పంటలు పండించవచ్చు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు పంట పొలాల పరిశీలన నిజజీవితంలో ఎంతో ఉపయోగపడుతుందని పంటలపై చేసేటువంటి శ్రమను గౌరవప్రదమైనదిని ప్రశంసించారు. దేశాభివృద్ధిలో ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ప్రముఖ పాత్ర పోషిస్తుందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో  వ్యవసాయ  ఉపాధ్యాయుని ఇందిరా ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.