వెయ్యి రోజుల విధ్వంసం!
సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీమంత్రి హరీశ్‌రావు మండిపాటు
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): ‘వెయ్యి రోజుల్లో మీరు ప్రజలకు చేసిన మంచి కంటే, సృ ష్టించిన విధ్వంసమే ఎక్కువ అనడానికి రోడ్డున పడుతున్న ఈ విద్యార్థుల(students) భవిష్యత్తే ప్రత్యక్ష సాక్ష్యం’ అని -మాజీమంత్రి హరీశ్ రావు(Harish Rao) విమర్శించారు. మైకు దొరికితే ప్రతిపక్షాలను తిట్టడం, అసత్యాలు ప్రచారం చేయడం మీద ఉన్న శ్రద్ధ.. క్షేత్రస్థాయిలో ఈ పిల్లలు పడుతున్న గోస మీద ఎందుకు లేదు..? అని ఆయన నిలదీశారు.
‘మీ ప్రభుత్వం ఫీజుల బకాయిలు(fee arrears) చెల్లించకపోవడంతో కాలేజీలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు(original certificates) ఇవ్వకుండా వేధిస్తున్నాయి. కష్టపడి చదువుకున్నా సర్టిఫికెట్లు చేతికి రాక.. అటు ఉద్యోగాల(jobs)కు, ఇటు పై చదువులకు వెళ్లలేక విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. చేతికొచ్చిన అవకా శాలు కోల్పోయి వాళ్ల భవిష్యత్తు అంధకారంలో పడితే ఎవరు బాధ్యత వహిస్తారు..? పేద విద్యార్థుల చదువుల మీద మీకెందుకంత కక్ష..? మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వాళ్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది’ అని మండిపడ్డారు.
ఈ విద్యార్థుల ఆవేదనను చూసైనా కళ్లు తెరవాలన్నారు. తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట శ్రీకృప కాలేజీ విద్యార్థులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సర్టిఫికెట్లు అందక ఇబ్బంది పడుతున్న లక్షలాది మంది విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలన్నారు. మీ వె య్యి రోజుల వైఫల్యాలకు ఇకనైనా ముగింపు పలకాలని ఆయన హితవు పలికారు.






