2 September, 2026 | 2:06 AM

తాండూర్‌ హైస్కూల్ విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ

01-09-2026 | 11:45pm

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని జెడ్‌పీహెచ్‌ఎస్ తాండూర్ పాఠశాలలో విద్యార్థులకు పాఠశాల యూనిఫామ్‌ల పంపిణీ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘసభ్యులు కుట్టి తయారు చేసిన పాఠశాలల యూనిఫామ్‌లను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకట్ రెడ్డి,గ్రామ సర్పంచ్  భూమా యాదగౌడ్, ఐకెపి ఏపీఎం కొమ్మ దత్తు, ఏఏపిసి చైర్మన్ లింగమ్మల చేతుల మీదుగా విద్యార్థులకు యూనిఫామ్‌లను అందజేశారు.

మహిళా శక్తి కార్యక్రమం ద్వారా స్థానికంగా మహిళలకు యూనిఫామ్‌ల తయారీకి ప్రోత్సాహం కల్పించడంతో పాటు, విద్యార్థులకు సమయానికి నాణ్యమైన యూనిఫామ్‌లు అందేలా చర్యలు చేపడుతున్నట్లు త్వరలో అన్ని గ్రామాలలో గల పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు వారు తెలిపారు. గ్రామ సర్పంచ్ యాదగౌడ్ మాట్లాడుతూ... ప్రభుత్వం ఈ సంవత్సరం విద్యార్థులకు నూతన యూనిఫామ్ అందించడం చాలా సంతోషంగా ఉందని, ప్రభుత్వానికి మహిళా సంఘాల మహిళలకు, సకాలంలో అందించిన ఐకెపి, విద్యాశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసారు. మహిళా శక్తితో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది అనే లక్ష్యంతో కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నట్లు  తెలిపారు.